దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉన్నా లక్షల కేసులు పెరుగుతున్నాయి. అందుకే దేశంలో ప్రతీ ఒక్క విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలను దేశ వ్యాప్తంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు కేంద్రం రెడీ అయింది.
కాబట్టి కరోనా తీవ్రత పెరగకుండా పార్లమెంటులో ఎంపి లు కూర్చునే సీట్లలో మార్పులు కూడా చేసారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు అయ్యే ఎంపీలు ప్రతి ఒక్కరూ సమావేశాలకు 72 గంటల ముందే కరొన పరీక్షలు చేయించుకుని రావాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు మరింత వేగంగా నమోదు అవుతున్నాయి. దేశ రాజధానిలో కరోనా పరిక్షల సంఖ్యను కూడా చాలా వేగంగా చేస్తున్నారు.