స్నేహ కూతురు ఎంత అందంగా ఉందో.. ఫోటో చూశారా?

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో స్నేహ ఒకరు. హోమ్లీ పాత్రలలో ఎక్కువగా నటించిన స్నేహ పెళ్లి తరువాత పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. దక్షిణాది భాషలన్నింటిలో నటించిన స్నేహకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గతేడాది విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు వదినగా నటించిన స్నేహ తన పాత్రతో అభిమానులను మెప్పించారు.

ఇటీవల తమిళ చిత్రం పటాస్ లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. 2012లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలోనే తమిళ నటుడు ప్రసన్నను స్నేహ వివాహం చేసుకున్నారు. వీళ్లకు విహాన్, ఆద్యంత సంతాపం. ఈ సంవత్సరం జనవరి 24వ తేదీన స్నేహ ఆద్యంతకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన తరువాత పాపకు సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలను స్నేహ అభిమానులతో పంచుకోలేదు.

అయితే తాజాగా తన భర్త 38వ పుట్టినరోజు సందర్భంగా పాపకు సంబంధించిన కీలక విషయాలను స్నేహ వెల్లడించారు. దాదాపు 200 రోజుల తరువాత పాప పేరు ఆద్యంత అని అభిమానులను పరిచయం చేశారు. భర్త, పాపతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. పాప పుట్టిన సమయంలో శుక్రవారం రోజు మహాలక్ష్మి పుట్టిందని పోస్టులు చేసిన స్నేహ తాజాగా మరోసారి ఫోటోలతో నెటిజన్లను ఆకర్షించారు. సోషల్ మీడియాలో స్నేహ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version