ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఆ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజదానులను ఏ విధంగా అడ్డుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసన సభలో ప్రయత్నం చేసి విఫలం అయినా సరే మండలిలో మాత్రం విఫలం కాలేదు. పట్టుసడల కుండా చంద్రబాబు, మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ఇద్దరూ కూడా వ్యూహాలు సిద్దం చేసారు.
తనకున్న విచక్షణాధికారంతో రాజధాని, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. ఆయన తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు అని భావించిన మంత్రులు అందరూ కూడా చైర్మన్ వ్యవహారశైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మండలి చైర్మన్ పై కొందరు మంత్రులు బూతులతో విరుచుకుపడినట్టు సమాచారం. దీనితో ఆయన రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మనస్తాపానికి గురైన షరీఫ్ రాజీనామా చెయ్యాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబుకి కూడా ఫోన్ లో చెప్పినట్టు సమాచారం. మరి కొందరు అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.