BREAKING: వరల్డ్ కప్ లో డేవిడ్ వార్నర్ సెంచరీ !

-

ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరియు నెదర్లాండ్ లు తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు, కెప్టెన్ తీసుకున్న నిర్ణయానికి వార్నర్ న్యాయం చేశాడు.. ఆరంభంలోనే మార్ష్ వికెట్ ను కోల్పోయినా స్మిత్ తో కలిసి రెండవ వికెట్ కు 132 పరుగులు జోడించారు. స్మిత్ (71) ఈ దశలో అనవసర షాట్ కు ప్రయత్నించి ఆర్యన్ దత్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్ లబుచెన్ (62) లు కలిసి మూడవ వికెట్ కు చాలా విలువైన 84 పరుగులు జోడించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ వన్ డే లలో సెంచరీ ని సాధించాడు, అదే విధంగా ఈ వరల్డ్ కప్ లో రెండవ సెంచరీ సాధించి అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు.

ఇదే విధంగా ఆస్ట్రేలియా ఆడి నెదర్లాండ్ ముందు భారీ స్కోర్ ను టార్గెట్ పెట్టి వారిని త్వరగా ఆల్ అవుట్ చేసి నెట్ రన్ రేట్ ను మెరుగయ్యేలా చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news