రేపటి నుంచి ఎంసెట్ హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 3 నుంచి 7 వరకు హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 9, 10, 11, 14 తేదీలలో ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇంజనీరింగ్ కి లక్షా నల్బై మూడు వేల మంది కి పైగా విద్యార్థులు ఎంసెట్ కోసం అప్లై చేసుకున్నారని తెలంగాణా విద్యా శాఖ పేర్కొంది. తెలంగాణ, ఏ పీ లో కలిపి 102 సెంటర్ లలో జరగనుంది ఎంసెట్.
తెలంగాణా లో 79 సెంటర్ లలో ఎంసెట్ పరిక్ష జరుగుతుంది. ఉదయం సాయంత్రం రెండు సెషన్స్ లలో జరగనుంది ఈ పరీక్ష. eamcet.tsche.ac.in నుంచి హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చుని, పూర్తి కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు.