అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు చంచల్‌గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు..ఓ భూవివాద పరిష్కారానికి రూ. 2 కోట్ల లంచం డిమాండ్ చేసిన చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది..ఇప్పటికే నాగరాజుపై ఏసీబీ నాలుగు కేసులు నమోదు చేసింది..వందల ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియాకు అప్పజేప్పి, నేరపూరిత కుట్రకు పాల్పడారన్న అభియోగంపై నాగరాజుపై నిన్న మరో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు ఏసీబీ అధికారులు.
గతంలో 16 గుంటల భూమికి ఫేక్ డాక్యుమెంట్స్‌తో పాస్ బుక్కులు ఇచ్చేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు. ఆర్డీవో వద్ద పెండింగ్‌లో ఉండగానే నాగరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఓ భూవివాద పరిష్కారానికి రూ. 2 కోట్ల లంచం డిమాండ్ చేసి.. రూ. 1.10 కోట్లు తీసుకుంటున్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.