బ్రేకింగ్: జమ్ములో భారీ ఎన్కౌంటర్

-

జమ్ము కాశ్మీర్ లో వరుస ఎన్కౌంటర్ లు జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. తాజాగా మరో చోట భీకర కాల్పులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లోని… కుల్గాం జిల్లాలోని చింగం ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.

ఆర్మీ అధికారులు ఎవరు అయినా గాయపడ్డారా అనే దాని మీద ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు తారస పడి కాల్పులకు దిగారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news