దేశంలో అత్యాచార ఘటనలకు అంతు లేకుండా పోతుంది. మానవత్వం మరిచిపోయి మృగాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. కఠిన చట్టాలు తెచ్చామని ప్రభుత్వాలు చెప్తున్నా సరే మృగాల తీరు మారడం లేదు. దేశంలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నా సరే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.
హార్డోయి సమీపంలోని… శాండిలా పట్టణంలోని టీచర్ ఇంటికి వెళ్లినప్పుడు 5 ఏళ్ల బాలికను తన ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారం చేశాడు. దీనిపై ఎస్పీ అనురాగ్ వాట్స్ మాట్లాడుతూ… “నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది అని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.