BREAKING : రోహిత్ శర్మ రికార్డును కొల్లగొట్టిన “కింగ్” కోహ్లీ … !

-

క్రికెట్ లో రికార్డులు సాధించాలన్నా ? మళ్ళీ వాటిని బ్రేక్ చేయాలన్నా ఇండియా ఆటగాళ్లకు సాధ్యం అని చెప్పాలి. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఉన్న చాలా రికార్డులను మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన పేరిట రాసుకున్నాడు. ఇక ఆ తర్వాత స్థానాలను ఇప్పుడు ఇండియాను సక్సెస్ గా ముందుకు తీసుకువెళుతున్న రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు తీసుకున్నారు. వీరిద్దరూ పోటాపోటీగా రికార్డు లను సృష్టిస్తూ అధిగమిస్తూ క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు చేసిన అత్యధిక పరుగులలో కాసేపటి క్రితం వరకు రోహిత్ శర్మ 1243 పరుగులతో లారా (1225) కన్నా ముందు ఉన్నాడు. కానీ కోహ్లీ ఇపుడు 1250 పరుగులతో రోహిత్ ను దాటేశాడు.

కాగా ఈ రికార్డు లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో సచిన్ టెండూల్కర్ 2278 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాలలో పాంటింగ్, సంగక్కర, కోహ్లీ లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news