ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పై పెరుగుతున్న విమర్శలు … అతనెందుకంటూ కామెంట్స్!

-

వరల్డ్ కప్ లో టీం ఇండియా జట్టులో ఆల్ రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఇండియా ఆడిన నలుడు మ్యాచ్ లలోనూ ఆడే ఛాన్స్ కొట్టేశాడు. కానీ ప్రదర్శన విషయానికి వస్తే చాలా తీసికట్టుగా ఆడుతున్నాడు.. ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బౌలింగ్ లో ఏమీ సాధించలేకపోయారు. వికెట్లు తీయడం మాట అటుంచితే పరుగులు కూడా నియంత్రించలేక చిన్న జట్లపై భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అందుకే ఇతన్ని తుది జట్టులో నుండి తర్వాత మ్యాచ్ లకు తీసివేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. మాములుగా ఈ మ్యాచ్ లోనే శార్దూల్ ఠాకూర్ కు బదులుగా అశ్విన్ లేదా శమిని తీసుకుంటారని భావించిన ఎందుకనో మళ్ళీ ఇతనికే యాజమాన్యం అవకాశం ఇచ్చింది.

బౌలర్ గా ఫెయిల్ అవుతున్న శార్దూల్ కు పదే పదే జట్టులో చోటు ఎలా దక్కుతుందో అంతుపట్టడం లేదంటూ ఇతన్ని విజయ్ శంకర్ తో పోలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news