ఇటీవల కోటీ 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు వ్యవహారంలో పలు లింకులు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అంజిరెడ్డి అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇప్పుడు కీలకం కానుంది. అంజిరెడ్డి భూములకు సంబంధించి నాగరాజు లంచం తీసుకుంటున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నేపథ్యంలోనే అంజి రెడ్డి ఇంట్లో సోదాలు చేయగా అంజిరెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ లభ్యమయ్యాయి.
రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా అంజిరెడ్డి చలామణి అవుతున్నాడు. ఆర్టీఐ ద్వారా ఈ భూముల వివరాలను రేవంత్ రెడ్డి సేకరించినట్టు తెలుస్తోంది. మేడ్చల్ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి హస్తం ఉందని గుర్తించినట్టు ఒక ఛానల్ లో కథనాలు ప్రసారం అవుతున్నాయి. నాగరాజు తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనివాస్ అదే విధంగా వీఆర్ఏ లను ఏసిబీ కస్టడీ కోరింది. ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.