సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి.కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఇదిలా ఉంటే… తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. ఆయన 2019లో హోంశాఖ సహాయమంత్రిగా, ఆ తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచి కీలకశాఖ పొందారు.
కిషన్ రెడ్డిని మంత్రి పదవి వరించడం వరుసగా ఇది రెండోసారి.కాగా, తెలంగాణలో బీజేపీకి సింగిల్‌గా 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే.. ఇలా సింగిల్‌గా 8 సీట్లు గెలుచుకోవటం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి.