నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రి శాఖ కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ మూడు లోక్ సభ స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కూటమిలో భాగంగా నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. దీంతో ఆయన్ను ప్రధాని మోడీ తన కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. బీజేపీ సామాన్య కర్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి శ్రీనివాసవర్మ ఎదిగారు.
ఇక నుంచి దేశ ప్రజలకు ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రిగా నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకి కీలక పదవి దక్కడంతో నరసాపురం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. కష్టపడి చేస్తే బీజేపీలో కీలక పదవులు లభిస్తాయని, ఇందుకు ఉదాహరణ శ్రీనివాసవర్మ అంటూ ఆయన ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.