అసలు నిర్భయ దోషులను ఉరి తీయడం సాధ్యమేనా…? ఏమో ఇప్పుడు ఈ అనుమానాలు నిజమే అంటున్నారు పలువురు. ఏడేళ్ళ క్రితం శిక్ష పడితే ఇప్పటి వరకు వారికి ఉరి అమలు కాలేదు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దర్యాప్తు పూర్తి అయి కోర్ట్ శిక్ష విధిస్తే ఆ కోర్ట్ ఈ కోర్ట్ అంటూ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకునే ప్రయత్నం చేస్తూ దోషులు తప్పించుకుంటున్నారు.
ఈ నెల 22న వాళ్ళను ఉరి తీయాలని కోర్ట్ డెత్ వారెంట్ ఇచ్చింది. తలారిని కూడా సిద్దం చేసిన తరుణంలో దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఉరిశిక్ష అమలును ఫిబ్రవరి ఒకటికి వాయిదావేశారు. ఐతే… ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. దీనితో ఫిబ్రవరి ఒకటిన శిక్ష అమలు జరుగుతుందని భావించారు.
కాని అనూహ్యంగా నిందితుల్లో ఒకడు అయిన పవన్ గుప్తా ఇప్పుడు 2012లో 23ఏళ్ల పారామెడికల్ విద్యార్తిని నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ అని సుప్రీం కోర్ట్ కి వెళ్ళాడు. తనకు బాల నేరస్థులకు విధించే శిక్షే విధించాలని అప్పట్లో వైద్య పరిక్షలు సరిగా జరపలేదని వాదిస్తున్నాడు. ఇప్పటికే అతని అభ్యర్ధనను కింది కోర్ట్ కొట్టేయగా, సుప్రీం కోర్ట్ విచారణ అంటే మాత్రం ఉరి శిక్ష వాయిదా పడటం ఖాయంగా కనపడుతుంది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష వెయ్యాల్సి వుంది.