BREAKING :పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర యూనిట్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా పుష్ప2′ కొత్త రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. 2024 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్న కారణంగా తొలుత ప్రకటించిన ఆగస్టు 15న సినిమా విడుదల చేయలేకపోతున్నామని వివరించింది.ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news