BREAKING : ఏ క్షణమైనా కూలనున్న శివసేన సర్కార్..!

-

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తన అనుచర ఎమ్మెల్యేలతో సూరత్ వెళ్లిన రాష్ట్ర మంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు. దీంతో మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు అసోం కు చేరింది. ఈ ఉదయం వీరంతా చార్టెడ్ విమానంలో గౌహతికి చేరుకున్నారు. గౌహతి ఎయిర్ పోర్టులో బిజెపి ఎంపీలు వల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గేహెన్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు.

అనంతరం వారిని నగర శివారులో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ కు తరలించారు. గౌహతి ఎయిర్ పోర్ట్ వద్ద షిండే మీడియాతో మాట్లాడుతూ.. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వర్గం చీలిపోదని చెప్పారు. మరో ఆరుగురు స్వతంత్రులు కూడా తనకు మద్దతిస్తున్నారని అన్నారు. త్వరలోనే తాము గవర్నర్ ను కలవాలనుకుంటున్నట్లు షిండే తెలిపారు. దీంతో శివసేన సర్కారు ఏ క్షణంలోనైనా కూలవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news