కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కరోనా సమయంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని పోరాటం చేస్తున్నాయని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రాణాలు తృణప్రాయంగా వదిలి మన పూర్వికులు మన కోసం స్వాతంత్రం తీసుకొచ్చారని మోడీ అన్నారు. కరోనా ఒక్కటే కాదు, మిడతలు, వరదలు కూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయని మోడీ ఆవేదన వ్యక్తం చేసారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసారు.
సవాళ్ళు మన సంకల్పాన్ని మరింత్ ద్రుడం చేస్తాయని అన్నారు. ఇంకా మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటామని మోడీ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో మన ఆరోగ్యాన్ని రక్షించడానికి వైద్యులు చాలా కష్టాలు పడుతున్నారని ఆయన వివరించారు. దేశ ప్రజలకు మానసిక స్థైర్యం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచమే కాదు దేశం కూడా విపత్కర పరిస్థితుల్లో పయనిస్తుందని మోడీ అన్నారు.