బిజెపిలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేరే అవకాశం ఉంది అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆమె పార్టీ మారే అంశానికి సంబంధించి స్పష్టత లేకపోయినా కొన్ని వార్తలు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో రేపు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో ఆమె సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కూడా కలిసే అవకాశం ఉంది.

ఆమె కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా సరే పార్టీ తరుపున దుబ్బాక ఉప ఎన్నికల్లో గాని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గాని ప్రచారం చేయలేదు. దీనితో ఆమె పార్టీ మారే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఆమె నేడు ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉంది.