ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడ్ని మార్చే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత కొంత కాలంగా కన్నా లక్ష్మీ నారాయణను లక్ష్యంగా చేసుకుని అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆయన పార్టీ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేసారని అధికార పార్టీ ఆరోపించడం గమనార్హం. రాజకీయంగా బలహీనంగా లేని పార్టీని వైసీపీ ఎంపీ విజయసాయి ఎందుకు టార్గెట్ చేసారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా ఉంది.
ఆయన బిజెపి అధ్యక్షుడి విషయంలో అసహనంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. కేంద్రానికి తమకు కన్నా… చంద్రబాబు సహకారంతో దూరం పెంచుతున్నారని జగన్ సర్కార్ మీద పదే పదే నివేదికలను కేంద్రానికి ఆయన పంపిస్తున్నారని విజయసాయి లో అసహనం ఉందని అంటున్నారు. ఈ విషయంలో ముందు నుంచి కన్నా కాస్త దూకుడుడుగా ఉన్నారని ఆయనను టార్గెట్ చేసారు విజయసాయి.
ఇదే కొనసాగిస్తే తమకు ఇబ్బంది అనే భావనలో విజయసాయి ఉన్నారు. అందుకే ఇప్పుడు కన్నాను మార్పించాలి అనే పదే పదే కన్నాను చంద్రబాబు కోవర్ట్ అని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అంటే బిజెపి అధిష్టానానికి అసహనం ఉంది కాబట్టి ఆయనను సాకుగా చూపించి ఆరోపణలు చేస్తే బిజెపి అధిష్టానం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అనే 20 కోట్ల రూపాయలు బాబు వద్ద తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈ ఆరోపణల మీద కేంద్రం కూడా దృష్టి పెట్టింది.
విజయసాయి ఆరోపణలు చేస్తున్న సమయంలో రాష్ట్ర పార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు. అధికారిక ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యలు చేసినా అది ఎలాగూ కన్నా చేతిలోనే ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక ఆయనను మార్చడానికి బిజెపి అధిష్టానం సిద్దమైంది అని సమాచారం. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా… ఎమ్మెల్సీ మాధవ్ ని నియమించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన విశాఖకు చెందిన నేత. రాజధానికి కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి.