ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ప్రధాని నరేంద్ర మోడీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అందరు ముఖ్యమంత్రులకు, విపక్ష నేతలకు ఫోన్ లు చేసిన మోడీ చంద్రబాబుకి మాత్రం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. దీనితో తన సలహాలను ఎలా అయినా సరే ప్రధానికి ఇవ్వాలి అని భావించిన చంద్రబాబు ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసారు.
ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసిన మర్నాడే… మోడీ నుంచి చంద్రబాబుకి ఫోన్ వచ్చింది. చంద్రబాబు చేసిన సూచనలను మోడీ తీసుకున్నారు. 14 రోజులు ఏ కేసు లేకపోతే గ్రీన్ జోన్ చెయ్యాలి, ఆ తర్వాత అనుమానితులు అందరికి పరిక్షలు చెయ్యాలి అని బాబు చేసిన సూచనను ఆయన పట్టించుకున్నారు. దేశ వ్యాప్తంగా దీన్ని అమలు చెయ్యాలని చూస్తున్నారు. ఇక దీనిపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేసారు.
ఇప్పుడు బిజెపి మీద చంద్రబాబు మాట పడనీయడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. సోనియా గాంధీతో గత ఎన్నికల సమయంలో స్నేహం చేసిన చంద్రబాబు… ఇప్పుడు ఆమెపై అర్నాబ్ గోస్వామి కాస్త పరిధి దాటి విమర్శలు చేసారు. పరోక్షంగా బిజెపికి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేసారు. దాని గురించి వదిలేసి… అర్నాబ్ మీద జరిగిన దాడిని మాత్రమే చంద్రబాబు ప్రస్తావించి, అర్నాబ్ కి మద్దతు ఇచ్చారు.
దాడి చేయడం తప్పు అన్నారు… అలాగే కరోనా కట్టడి విషయంలో మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే చంద్రబాబు నుంచి మద్దతు మాత్ర౦ స్పష్టంగా వస్తుంది. ఇప్పుడు మోడికి దగ్గరైతే ప్రయోజనాలు ఉంటాయని, రాష్ట్రంలో అమరావతి తరలింపు ని ఆపడమే కాకుండా, రాష్ట్రం లో వైసీపీని కట్టడి చేయవచ్చు అనే భావనలో ఉన్నారు. అందుకే ఏమో వైసీపీ మీద రాష్ట్ర బిజెపిని చంద్రబాబు ఉసిగొల్పారు అని అంటున్నారు.