మనసు మార్చుకున్న కేసీఆర్ .. రాజ్యసభ రేసులో మళ్ళీ కవిత…!

-

తెలంగాణాలో ఈ నెల ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల కోసం అధికార తెరాస పార్టీలో పోటీ నెలకొంది. ఎవరిని రాజ్యసభకు పంపించాలి అనే దానిపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇన్నాళ్ళు రాజ్యసభ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించిన కెసిఆర్ ఇప్పుడు కాస్త దూకుడు పెంచినట్టే కనపడుతుంది. ఎవరిని రాజ్యసభకు పంపాలి అనే దాని మీద ఆయన ఒక అవగాహనకు వచ్చినట్టే కనపడుతుంది. తెలంగాణాలో బలమైన సామాజిక వర్గాల నుంచి కీలక నేతలు రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.

అయితే ఇప్పుడు రాజ్యసభ విషయంలో కెసిఆర్ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఉన్న రెండు స్థానాల్లో రెండు సామాజిక వర్గాల నుంచి ఇద్దరు నేతలను ఆయన ఎంపిక చేసినట్టు సమాచారం. అందులో ఒకరు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పేరుని ఆయన మళ్ళీ పరిశీలిస్తున్నారు. కవితను ముందు రాజ్యసభకు పంపడం లేదు మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కాని ఇప్పుడు ఆమెను మళ్ళీ రాజ్యసభకు పంపాలని చూస్తున్నారు. ఆమె కూడా రాజ్యసభకు వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఉన్నారు.

ఎంపీ గా ఓటమి తర్వాత కవిత కాస్త పార్టీకి దూరంగా ఉన్నారు. అయినా సరే ఆమె పార్టీ నేతలతో, నిజామాబాద్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ఆమెతో పాటుగా మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ని కూడా రాజ్యసభకు పంపే అవకాశం ఉందని, హెటిరో డ్రగ్స్ అధినేత పార్థ సారధి రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారని అంటున్నారు. ఒకవేళ కవితను రాజ్యసభకు పంపేలా అయితే సీనియర్ నేత కే కేశవరావు ని మంత్రి వర్గంలోకి తీసుకునే యోచనలో ఉన్నారట కెసిఆర్. మరి ఎవరిని పంపిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version