తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒంటరి అయిపోయారు. మల్కాజ్ గిరి ఎంపీ గా ఉన్నా సరే ఆయనకు ఏ మాత్రం తెలంగాణా కాంగ్రెస్ లో గుర్తింపు రావడం లేదు. ఆయనకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఆంధ్రా లో కూడా ఆయనకు క్రేజ్ ఉంది. అయినా సరే ఆయనకు కాంగ్రెస్ నుంచి మద్దతు రావడం లేదు. ఆయనకు ఉన్న ఇమేజ్ తెలంగాణాలో ఏ కాంగ్రెస్ నేతకు లేదు అనేది వాస్తవం.
రాజకీయంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నా సరే ఆయన మాత్ర౦ తెరాస పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటారు. అక్కడి వరకు ఆగితే బాగానే ఉండేది గాని తెలంగాణా పురపాలక శాఖా మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ మీద డ్రోన్ ఎగురవేశారు ఆయన. ఆ డ్రోన్ ఎగురవేయడం తో ఆయన ఢిల్లీ నుంచి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసారు.
ఆయన కోసం ఏ ఒక్క నాయకుడు ముందుకి రావడం లేదు. కనీసం ఆయనకు మద్దతుగా స్వరం వినిపించే నాయకుడు తెలంగాణా కాంగ్రెస్ లో బూతద్దం పెట్టి వెతికినా సరే ఎక్కడా దొరకడం లేదు. దీనితో ఇప్పుడు ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాప౦ రేవంత్ అని ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో ఉన్న ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన కోసం కాంగ్రెస్ అధిష్టానం అయినా వస్తుందో రాదో చూడాలి.