BREANIKG : ఆఫ్గనిస్తాన్ లోని ఐఎస్ఐ స్థావ‌రాల‌పై అమెరికా వైమానిక దాడులు..!

-

ఆఫ్గ‌నిస్తాన్ లో అమెరికా సైనికుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా మూడు బాంబ్ బ్లాస్ట్ ల‌కు పాల్ప‌డ‌టంతో అమెరికా సైనికులు ప‌ద‌మూడు మంది మృతి చెంద‌డా ఈ దాడిలో తాలిబ‌న్లు, ఆఫ్గ‌నిస్తాన్ పౌరులు కూడా మ‌ర‌ణించిన‌ట్టు అంత‌ర్జాతీయ మీడియా ప్ర‌చురించింది. ఇక ఈ ఘ‌ట‌న పై అమెరికా సీరియ‌స్ అయ్యింది. త‌మ సైనికుల పై దాడి చేసిన వారిని వ‌ద‌ల‌మ‌ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు.

పేలుళ్ల వెన‌క ఉన్న‌వారి అంతు చూస్తామ‌ని వ్యాఖ్యానించారు. ఇక ఈ నేప‌థ్యంలోనే ఆఫ్గ‌నిస్తాన్ లో ఉన్న ఐఎస్ఐఎస్ కే స్థావ‌రాల‌పై అమెరికా వైమానిక దాడుల‌కు దిగింది. కాబుల్ ఎయిర్ పోర్ట్ గేట్ల వద్ద ఉన్న ప్ర‌జ‌లు వెంట‌నే వెన‌క్కి వెళ్లిపోవాల‌ని అమెరికా ప్ర‌క‌టించింది. ఇక అమెరికా దూకుడు చూస్తుంటే ఐఎస్ఐఎస్ ను వ‌దిలిపెట్టేలా క‌నిపించ‌డంలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version