కాళ్ళు మొద్దుబారిపోయినట్టున్నాయా..? పెరిఫెరల్ ఆర్టెరీల్ డిసీస్ అవ్వచ్చు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవన విధానం సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మిలియన్ల మంది హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ మొదలైన హృదయ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. చాలా మందికి చెస్ట్ పెయిన్, శ్వాస ఆడకపోవడం, ఎడమ చేతిలో మరియు భుజాలలో నొప్పి కలగడం, వికారం, కడుపులో ఇబ్బందిగా ఉండటం లాంటివి కనబడుతున్నాయి.

అయితే ఇవి కూడా హృదయ సంబంధిత సమస్యలకు లక్షణాలు అని వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే కాళ్ళు మొద్దుబారి పోవడం లాంటివి కూడా ఉంటోంది. అయితే దీనికి సంబంధించి నిపుణులు పరీక్షించగా.. దీనిని పెరిఫెరల్ ఆర్టెరీయల్ డిసీజ్ Peripheral Arterial Disease (PAD) అని అంటున్నారు.

పైన మరియు కింద ఆర్టెరీస్ సన్నగా అయిపోవడం దీనితో బ్లడ్ సర్కులేషన్ అవ్వకుండా ఉండటం లాంటివి జరుగుతాయి. అయితే దీనికి గల కారణం ఏమిటంటే..? చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం లేదా కొవ్వు పదార్థాల నుంచి క్యాల్షియం అందడం మరియు స్మోకింగ్ వంటి కారణాల వలన ఇది వస్తోంది.

అయితే భారతదేశంలో ఈ సమస్యతో 41 మిలియన్ మంది నుండి 54 మిలియన్ల మంది ఇబ్బంది పడుతున్నట్లు SAGE రిపోర్ట్ తెలిపింది. అయితే డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని గుర్తించారు వైద్యులు. అదేవిధంగా స్మోకింగ్ చేసే వాళ్ళల్లోకూడా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. హైపర్టెన్షన్, సరైన జీవన విధానం లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాళ్లలో కూడా ఇలాంటివి కనబడతాయి.

లక్షణాలు:

తల నొప్పి కలగడం
నడుము భాగంలో నొప్పి కలగడం
కాళ్ళు సన్నగా అయిపోవడం
కాళ్లు రంగు మారడం
కాళ్ళు మొద్దుబారి పోవడం
జుట్టు ఊడిపోవడం
తగ్గలేనటువంటి అల్సర్లు రావడం

దీని గురించి డాక్టర్ మాట్లాడుతూ చాలా మందిలో సరైన అవగాహన లేదని ఇటువంటి లక్షణాలు ఉంటే వాస్కులర్ సర్జెన్ ని కన్సల్ట్ చేయాలని.. ఒకవేళ 50 ఏళ్లు దాటిన వ్యక్తికి డయాబెటిస్ ఉండి మరియు స్మోకింగ్ చేస్తున్నట్లయితే ఆర్టెరీస్ చెక్ చేయించుకోవాలని సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version