బ్రేకింగ్ : కన్ను మూసిన సీనియర్ నటి..!?

-

ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగి పోయిన విషయం తెలిసిందే. వివిధ ఇండస్ట్రీలలో ఎంతగానో గుర్తింపు సంపాదించి అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ఎంతో మంది నటులు కన్నుమూశారు. దీంతో అభిమానులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య కరోనా తో మృతి చెందగా… అభిమానులందరూ విషాదంలోకి మునిగిపోయారు.


ఇక తాజాగా సినీ నటి శాంతమ్మ (94) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న నటి శాంతమ్మ… మార్చి నెలలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వైద్యం అందించినప్పటికీ రోజురోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇక ఇటీవలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో తుది శ్వాస విడిచారు నటి శాంతమ్మ . కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శాంతమ్మ.. దాదాపుగా 200 సినిమాలకు పైగా నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. శాంతమ్మ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news