నా పిల్లలను తీసుకు రండి… తల్లి ఆవేదన…!

-

ఎవరు ఎన్ని చెప్పినా సరే కరోనా మహమ్మారి మిగిల్చిన వివాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా మహమ్మారి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అది ఆగడం లేదు. ఇక ఇది పక్కన పెడితే ఎన్నో బంధాలను ఇది దూరం చేసింది అనే మాట వాస్తవం. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. దుబాయ్ కి చెందిన నహీద్ బిలాల్ అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇద్దరు అమ్మాయిలూ ఒక అబ్బాయి. వాళ్ళు కరోనా రావడానికి ముందుగా తమ బంధువులతో ఉండటానికి గానూ పాకిస్తాన్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఉండిపోయారు. లాక్ డౌన్ తో తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. దుబాయ్ రావాలి అని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే సాధ్యం కాలేదు. అన్ని దేశాలు కూడా విమాన సర్వీసులను దాదాపుగా ఆపేసిన సంగతి తెలిసిందే. దీనితో ఎలా వెళ్ళాలో అర్ధం కాని పరిస్థితి.

ఈ నేపధ్యంలో మహిళ తన పిల్లలను ఏ విధంగా అయినా సరే దుబాయ్ తీసుకుని రావాలి అని ఆమె అధికారులను వేడుకుంటుంది. ఇంట్లో ప్రతీ ప్రదేశం కూడా తన పిల్లలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి అని తాను తన పిల్లలకు దూరంగా ఉండలేను అని పేర్కొన్నారు. పిల్లలు లేని ఇల్లు ఒక ఇల్లు కాదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మరి దీనిపై ఏ విధంగా అధికారులు స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news