ఇది మాకు ‘ఒబామా మూమెంట్’.. రిషి సునాక్ గెలుపుపై బ్రిటన్‌ వాసులు

-

రిషి సునాక్ గెలుపుపై బ్రిటన్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రిషి గెలుపు తమకు ‘ఒబామా మూమెంట్’  అని అంటున్నారు. ‘అప్పుడు అమెరికాకు బరాక్‌ ఒబామా.. ఇప్పుడు మాకు రిషి సునాక్‌’ అని హిందూ దేవాలయ కమిటీ అన్నారు. బ్రిటన్‌కు నూతన ప్రధానిగా ఎన్నికైన ఆయన భారత మూలాలున్న వ్యక్తి. శ్వేతేతర జాతీయుడు.

లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలో సౌతాంప్టన్‌లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. దీనిని రిషి తాత రామ్‌దాస్ సునాక్‌ నిర్మించారు. తర్వాత రిషి కుటుంబం ఆ ఆలయంతో అనుబంధం కొనసాగిస్తోంది. ఆయన నిత్యం దానిని సందర్శిస్తుంటారు. ఇక ఈ అపూర్వ విజయం నేపథ్యంలో ఆలయ కమిటీ స్పందించింది.

‘ఇది గర్వించదగ్గ క్షణం. రిషి విజయంతో ఈ గుడి ఆవరణలో సందడి నెలకొంది. ఇక్కడివారు ఆయనతో దిగిన చిత్రాలను చూపించి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్‌కు బరాక్‌ ఒబామా మూమెంట్‌. మొదటిసారి శ్వేతేతర జాతీయుడు ప్రధాని అయ్యారు. ఈ వార్త వినగానే వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించాం’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news