చైనా విద్యార్థిని ప్రాణాలు కాపాడిన బ్రిటన్ రాయబారి….!

-

ప్రస్తుత సమాజంలో పబ్లిసిటీ పీక్స్ కు వెళ్లాలన్నా ఉన్న కాస్త పరువు పోవాలన్నా సోషల్ మీడియా ఒక్కటి చాలు. మనల్ని ఓ రేంజ్ లో నిలబెడుతుంది మరి.. ఇదే క్రమంలో బ్రిటన్ రాయబారి ఓ విద్యార్థిని ప్రాణాలు కాపాడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు ఏంటీ కథ.. ఏం జరిగి ఉంటుందో మీరు తెలుసుకోండి..!

Britain

చైనాలోని చాంగ్‌కింగ్‌లో ఒక విద్యార్థిని ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతుండగా బ్రిటన్ రాయబారి బ్రిటన్‌ రాయబారి స్టీఫన్‌ ఎల్లిసన్‌ నీటిలో దూకి కాపాడారు. ఈ వార్తను చైనా అధికారిక వార్తా సంస్థ, బ్రిటన్‌ రాయబార కార్యాలయం వేర్వేరుగా ప్రకటించాయి. విద్యార్ధిని నీటిలో మునిగే సమయంలో అరుస్తుండగా ఎల్లిసన్‌ కాపాడుతున్న వీడియోను బ్రిటన్‌ కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా బాగా వైరల్‌ అయింది. వీక్షకులనుంచి విశేష స్పందన వచ్చింది. కాగా దీనిపై చైనా అధికారిక పత్రిక జిన్హులో “విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కోలుకుని స్పృహాలోకి వచ్చారు, శ్వాస కూడా యాథావిధిగా తీసుకోగలుగుతున్నట్లు.. రక్షించినందుకు ధన్యవాదాలు” చెపుతూ కథనాన్ని ప్రచురించింది. ప్రైవసీ దృష్ట్యా ఆ విద్యార్థిని పేరును ఎక్కడ వెల్లడించలేదు.

ఇదే విషయం పై స్పందించిన బ్రిటన్‌ రాయబార కార్యాలయం ఎల్లిసన్‌ ధైర్యసహసం గురించి ప్రస్తావిస్తూ.. ఇది చూసి యావత్తు బ్రిటన్‌ ప్రజలు గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో తమ సాహసాలు మరోసారి బయటపడినట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా గత కొద్ది నెలలుగా బ్రిటన్‌ -చైనా సంబంధాలు సన్నగిల్లాయి. ఇందుకు అసలైన ఏంటంటే… కా 156 ఏళ్ల బ్రిటీష్‌ పాలన తరువాత బీజింగ్‌ను తిరిగి అప్పగించిన  నుంచి హాంకాంగ్లో ప్రజాస్వామ్య నిరసనలను వెల్లువెత్తాయి. వాటిని అరికట్టడానికి కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలన్న చైనా నిర్ణయంపై ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. గత కొద్ది నెలలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా తన సరిహద్దు దేశాలు సహా, బ్రిటన్‌ ప్రయాణికులును కూడా నవంబర్‌ 5 నుంచి తమ దేశానికి ప్రవేశాన్ని నిషేధించింది. మరి ఈ సంఘటనతో రెండు దేశాల మధ్య స్నేహపూరితమైన సంబంధాలు చిగురిస్తాయో లేదా తమ ధోరణి మారేది లేదాంటాయో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version