షర్మిలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనబడుతున్నారు : బ్రదర్ షఫీ

Join Our Community
follow manalokam on social media

మంచి మార్పు కోసం షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారని మోటివేటింగ్ స్పీకర్ బ్రదర్ షఫీ పేర్కొన్నారు. నన్ను షర్మిల ఆహ్వానించారు. ఆమెతో సుదీర్ఘంగా చర్చించారని ఆయన అన్నారు. సరైన ప్రభుత్వం, పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. షర్మిలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనబడుతున్నారన్న ఆయన త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నారని అంటూ కొత్త పార్టీకి సంబందించిన హింట్ ఇచ్చారు.

ప్రజల్లో మార్పు రావాలంటే రాజకీయాల్లో మార్పులు రావాలని ఆయన అన్నారు. ఇక లోటస్ పాండ్ లో మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ కుమార్ లు కూడా షర్మిలను కలిసిన వారిలో ఉన్నారు. వైఎస్ హయాంలో సీఎంవోలో ప్రభాకర్ రెడ్డి, ఉదయ కుమార్ సింహ కీలక పదవుల్లో పని చేశారు. ఇక రానున్న రోజుల్లో షర్మిల చాలా మంది ప్రముఖులను కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....