చెల్లెని ప్రేమించాడు, గోదారిలో శవమైతేలాడు… విషయం ఏంటో ఎవరికి తెలీదు…!

-

ఈ రోజుల్లో మానవ సంబంధాలు క్షీణించాయి అనేది కొన్ని కొన్ని సంఘటనల కారణంగా చెప్పవచ్చు. గత౦లో బంధాలకు ఎక్కువగా విలువ ఇచ్చే భారతీయులు ఇప్పుడు పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు. ఇలా బంధాన్ని మరిచి ప్రేమించి జీవితాన్ని నాశనం చేసుకున్న ఘటన రాజమండ్రి సమీపంలో జరిగింది. రాజమండ్రి సమీపంలో ఉన్న గ్రామంలో సురేష్ అనే ఒక యువకుడు కొంత కాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం గురించి కేవలం ఒకరు ఇద్దరికీ మినహా ఎవరికి పెద్దగా తెలియదు. వారి ప్రేమ కొంత కాలం సాఫీగా సాగింది.

అమ్మాయి కూడా అతని మీద ఉన్న ఇష్టంతో ప్రేమను అంగీకరించింది. పెళ్లి చేసుకుందామని, లేచి వెళ్ళిపోదామని భావించారు. ఇద్దరిది ఒకే కులం అయినా సరే వారి బంధం మాత్రం వివాహానికి అంగీకరించే అవకాశం ఉండదు. దీనితో అబ్బాయిలో ఆవేదన రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆమెకు దూరంగా ఉండాలని భావించినా సరే అది సాధ్యం కావడం లేదు. ఆమె అతనికి నచ్చేజేప్పే ప్రయత్నం చేసినా అతను సాధారణ మనిషి అవ్వడం లేదు. ఇలా జరుగుతున్న సమయంలో ఆమెకు దూరం కాలేక మరొకరిని వివాహం చేసుకోలేక… అతను జీవితాన్ని ముగించాలనుకుని,

నిర్ణయం తీసుకుని గోదావరికి వెళ్ళారు… గోదాట్లో దూకి ఆత్మహత్యకు పాల్పడగా అక్కడ ఉన్న జాలర్లు అతన్ని బయటకు తీసారు. అసలు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఎవరికి తెలియదు. కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు. అతను ప్రేమించింది సొంత బాబాయి కూతురుని… అంటే వరసకు సోదరిని. ఈ వివాహం జరిగితే కుటుంబాల పరువు పోతుందని భావించిన అతను ప్రాణం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం గురించి కేవలం ఇద్దరికీ మాత్రమే తెలుసు… ఈ ఘటన జరిగి రెండు నెలలు అయినా సరే… ఆత్మహత్యకు కారణం మాత్రం తెలియలేదు తల్లి తండ్రులకి…!

Read more RELATED
Recommended to you

Latest news