తహశీల్దార్‌ను చంపిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. ఎందుకు చంపాడంటే..?

-

రంగారెడ్డి జిల్లాలో మహిళా తహశీల్దార్ దారుణ హత్య కు గురయ్యారు. అబ్దుల్లా పూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయం అధికారి విజయారెడ్డిపై ఓ గుర్తు తెలియని యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించారు కాల్పుల తీవ్రతకు విజయారెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని సురేశ్ గా గుర్తించారు. గౌరెల్లి గ్రామవాసిగా అతన్ని గుర్తించారు. ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు అదుపులో హంతకుడు ఉన్నాడు. అయితే ఈ ఘటనకు కారణం ఎమ్మార్వో వేధింపులేనని తెలుస్తోంది.

పొలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మార్వో డబ్బుల కోసం వేధించినట్లుగా సురేష్ ఆరోపిస్తున్నాడు. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు లంచం అడిగినందుకే ఆమెను సజీవ దహనం చేసినట్లుగా తెలిపాడు. అనంతరం నిందితుడు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మరోవైపు, విజయ హత్యపై రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news