BRS ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య: 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము .. చెక్ చేసుకోండి !

-

తాజాగా BRS ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్టీవీ తో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి ఇటీవల ఉచిత విద్యుత్ పెయిన్ మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎం అబ్యర్ధిగా చేస్తాము అంటూ కామెంట్ చేసి ఇప్పుడు నా మాటలు మార్ఫింగ్ చేశారు అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి స్పందించారు సండ్ర. ఈయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నీ మనసులో ఉన్న విషయాలన్నీ మాట్లాడి తర్వాత నేను మాట్లాడలేదు BRS పార్టీ మార్ఫింగ్ చేసింది అంటూ కథలు చెబుతావా అంటూ సెంటింగ్ ఇచ్చాడు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సారధ్యంలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే వచ్చి చెక్ చేసుకోండి అంటూ సవాలు విసిరాడు. కాంగ్రెస్ ఎప్పుడు మాటమీద నిలబడింది, ఒక మాట చెప్పడం మాట మార్చేయడం అలవాటుగా మారిపోయింది అంటూ కామెంట్ చేశాడు.

 

రాష్ట్రానికి మూడు గంటలు ఉచిత విద్యుత్తు చాలు అంటే రేవంత్ రెడ్డి చప్పట్లు కొట్టారు. ఇప్పుడేమో మాట మారుస్తున్నారు అంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news