కొంతకాలంలోనే తెలంగాణాలో ఎన్నికల నగారా మోగనుంది. ఇందుకోసం అధికార, విపక్ష పార్టీలు అన్నీ తమ వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే BRS పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికలకు ఎటువంటి మేనిఫెస్టో ను ప్రకటించడం లేదట. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. మాములుగా ఎన్నికలకు మేనిఫెస్టో లో కొన్ని హామీలను పొందుపరిచి మీరు మాకు ఓటు వేసి గెలిపిస్తే వీటిని చేస్తాము అంటూ చెప్పాలి. కానీ ఈసారి ఎన్నికలకు కేసీఆర్ పార్టీ మాత్రం.. మేనిఫెస్టో ప్రకటించడం లేదు అని తెలుస్తోంది. గత రెండు పర్యాయాలుగా చెప్పిన మానిఫెస్టోలలో ఉన్న హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే బాధ్యతను తీసుకోనున్నారట. మళ్ళీ కొత్త హామీలను ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం కన్నా ఉన్నవాటినే మెరుగ్గా ఆచరణలో పెడితే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
తెలంగాణ ఎన్నికలు: మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు గులాబీ బాస్ ?
-