చాలా మంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తుంటారు అయితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని మాత్రం పాటించాలి. చాలా మంది ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేస్తారు ఆ తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ ఒక సారి కూర్చుని వచ్చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నారనేది ఎంతో ముఖ్యమైనది.
ఓపిక ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేస్తే మంచిది ఇలా ప్రదక్షిణలు చేయడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఒకవేళ అన్ని ప్రదక్షిణాలు చేయలేని వాళ్ళు 54 ప్రతిక్షణాలు చేయొచ్చు. లేదంటే 27 కానీ 11 ప్రదక్షిణాలు చేసినా కూడా మంచి ఫలితం కనబడుతుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలా ప్రదక్షిణలు విషయంలో ఈ పద్ధతిని పాటించడం మర్చిపోకండి. ఇలా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది.
ఎలాంటి సమస్యలనుండైనా గట్టు ఎక్కవచ్చు. చూసారు కదా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలా ఆచరించాలని.. మరి ఈసారి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగిందంటే ఎంతటి సమస్యనుండైనా సరే బయటపడవచ్చు కష్టాలు బాధలు నుండి దూరంగా ఉండొచ్చు.