తెలంగాణకు చెందిన స్టార్ బ్యాడ్మింటన్ మహిళా ప్లేయర్ పి వి సింధు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన కెరీర్ లో రెండు సార్లు ఒలింపిక్ మెడల్ ను గెలుచుకుని భారతదేశం గర్వించేలా చేసింది. కానీ ఈ సంవతసరం తనకు ఎందుకో అంతగా కల్సి రావడం లేదు, ఇప్పటి వరకు ఒక్క టైటిల్ ను కూడా గెలవలేక ఓటమి బాటలో పయనిస్తూ ఉంది. కేవలం మాడ్రిడ్ ఓపెన్ లో ఫైనల్ కు చేరి రన్నర్ అప్ గా నిలవడం ఒక్కటే ఉత్తమ ప్రదర్శన అని చెప్పాలి. ఇక ఈ మధ్యనే జరిగిన యుఎస్ ఓపెన్ లో టైటిల్ సాధిస్తుంది అనుకుంటే క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమి పాలయింది. ఈ ఓటమి అనంతరం సింధు సోషల్ మీడియాతో తన భావాలను పంచుకుంది. ఈమె మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఒక్క టైటిల్ ను కూడా గెలవకపోవడం నన్ను చాలా బాధించింది.
BADMINTON: వరుస ఓటములపై తెలుగుతేజం పి వి సింధు ఎమోషనల్… !
-