కోదాడ పోరు హోరాహోరీ..ఆధిక్యం మారిందా!

-

ఏపీకి బోర్డర్‌లో ఉంటూ…కాస్త ఏపీ తరహా రాజకీయం కనిపించే నియోజకవర్గం కోదాడ. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి సమానమైన బలం ఉంది.. కరెక్టుగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు బోర్డర్ లో ఉంటుంది. ఇక ఈ నియోజకవర్గంలో మొదట నుంచి కాంగ్రెస్-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ వస్తుంది.

1985, 1989, 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవగా, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. 2009లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది.ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి గెలిచారు. 2018 ఎన్నికలోచ్చేసరికి సీన్ మారింది. 2014లో టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయిన బొల్లం మల్లయ్య యాదవ్..సీటు లేదని తెలిసి 2018 ఎన్నికల ముందు బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళి సీటు తెచ్చుకున్నారు. అటు టీడీపీ-కమ్యూనిస్టులతో కాంగ్రెస్ జత కట్టింది.

ఇక కాంగ్రెస్ నుంచి పద్మావతి నిలబడ్డారు. కానీ అనూహ్యంగా ఆమె స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. మల్లయ్య విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా మల్లయ్యకు ఈ నాలుగు ఏళ్లలో పెద్దగా మంచి మార్కులు ఏమి పడలేదు. ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. సొంత పార్టీ వాళ్లే ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటు హుజూర్‌నగర్‌తో పాటు కోదాడపై ఉత్తమ్ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు.

ఈ సారి హుజూర్‌నగర్, కోదాడలో భారీ మెజారిటీలతో గెలవాలని చూస్తున్నారు. హుజూర్‌నగర్ లో ఉత్తమ్, కోదాడలో పద్మావతి పోటీ చేయడం ఖాయమే. అయితే కోదాడలో టి‌డి‌పికి కాస్త ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ బి‌జే‌పికి పెద్ద బలం లేదు. మొత్తానికైతే ఇక్కడ బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఎమ్మెల్యేపై ఇంకా వ్యతిరేక పెరిగి..ఉత్తమ్ ఫ్యామిలీ పుంజుకుంటే కోదాడలో కాంగ్రెస్ జెండా ఎగిరే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version