రేప్ చేస్తే.. ఏ దేశంలో ఏ శిక్ష..?

-

ప్రియాంక ఆత్మ శాంతించాలి అంటే వాళ్ళను తక్షణమే కాల్చి చంపాలి… ఉరి వద్దు… నడి రోడ్డు మీద కాల్చి చంపాలి… ఏ మాత్రం కనికరం లేకుండా వాళ్ళను హింసించి చంపాలి… మన దేశంలో ఉన్న చట్టాలే ఇలాంటి నేరాలకు అనువుగా మారుతున్నాయి… ఇప్పుడు దేశం మొత్తం వినపడుతున్న మాట ఇది… ఇతర దేశాల్లో విధించే శిక్షల మాదిరిగా నేరస్తులను కఠినంగా శిక్షిస్తే గాని ఇలాంటివి ఆగుతాయని అంటున్నారు. అసలు ఇతర దేశాల్లో ఉన్న చట్టాలు ఏంటి…? ఇతర దేశాల్లో రేప్ చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారు.

ఉత్తర కొరియా… నియంత కిమ్ జాంగ్ పరిపాలిస్తున్న ఈ దేశంలో అయితే నేరం రుజువు కాగానే వెంటనే తుపాకితో కాల్చి చంపేస్తారు. ఒళ్లంతా తుపాకి గుళ్ళతో జల్లెడ చేసేస్తారు. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో… నేరం రుజువు కాగానే అత్యాచారానికి పాల్పడే నేరగాడికి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. నేరం తీవ్రంగా ఉంటే చనిపోయేంత వరకు (జీవిత ఖైదు) శిక్ష విధిస్తారు. మరో అగ్ర రాజ్యం రష్యాలో అయితే… సాధారణ శిక్షలే విధిస్తారు. ఇక సౌదీ అరేబియాలో అయితే… బహిరంగంగా బాధితుల ముందే తల నరికి శిక్ష అమలు చేస్తారు. అది వాళ్ళ దేశం వాళ్ళు అయినా విదేశాల వాళ్ళు అయినా సరే…

ఇక ఇరాన్ విషయానికి వస్తే… నేరం రుజువు అయితే ఉరిశిక్ష విధిస్తారు… నేరం తీవ్రంగా ఉంటే మాత్రం తక్షణమే కాల్చి చంపేస్తారు. ఫ్రాన్స్ లో అత్యాచారం చేస్తే నేరగాళ్లకు నేరం తీవ్రత ఆధారంగా 15 నుంచి 30 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో అయితే అత్యాచారం రుజువు అయిన నాలుగో రోజు… నిందితుడిని రోడ్ల పై ఈడ్చుకు వెళ్లి ప్రజలు అందరి ముందు కాల్చి పారేస్తారు. చైనాలో నేరం తీవ్రతను బట్టి… నిందితులకు విధించే శిక్షలో మార్పులు ఉంటాయి. రుజువైతే వెంటనే అతడి పురుషత్వాన్ని నాశనం చేస్తారు. అంటే, సర్జరీ ద్వారా అతడి కి మగతనం లేకుండా చేస్తారు. అత్యాచారం లేదా, అత్యంత దారుణంగా రేప్ చేస్తే మరణ శిక్ష విధిస్తారు. మన దేశంలో నేరం తీవ్రతను బట్టి శిక్షలు విధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news