ఆ టాలీవుడ్ హీరోయిన్ పెళ్ల‌య్యిపోయిందోచ్‌..

-

ఇటీవల భారతీయ సినిమా రంగంలో పలువురు హీరోయిన్లు వరుసపెట్టి తమకు నచ్చిన వాడితో మూడుముళ్లు వేయించుకుని కుటుంబ జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. బాలీవుడ్లో మంచి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లు దీపిక పడుకొనే, అనుష్క శర్మ సైతం త‌మ‌కు నచ్చిన వాళ్లని పెళ్లి చేసుకుని అటు కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే.. ఇటు సినిమాల్లోనూ బిజీ బిజీగా ఉంటున్నారు. మరో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏకంగా హాలీవుడ్‌కు చెందిన యువ‌కుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే.

ఇక సౌత్‌లోనూ పలువురు సీనియర్ హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. టాలీవుడ్ లో కొద్ది రోజుల క్రితమే అర్చన పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. తన ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ప్రతి విషయాన్ని అందరితో పంచుకునే ఎంజాయ్ చేసింది అర్చన. తన పెళ్లికి పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించింది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ హీరోయిన్స్ సైతం చాలా గుంభనంగా పెళ్లి చేసేసుకుంది.. ఆ హీరోయిన్ ఎవరో కాదు మ‌నాలి రాథోడ్‌.

ఔత్సాహిక పారిశ్రామికవేత్త రవి ఇజ్జార్ ను ఆమె పెళ్లాడింది. వంశీ తీసిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాతో పాపులర్ అయింది మనాలీ రాధోడ్. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చేసిన గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా వంటి చిత్రాలు కూడా ఆమె కెరీర్ లో ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో కోలీవుడ్ కు వెళ్లింది మనాలీ. అక్కడ కూడా ఆమెను ఫ్లాపులు వెక్కిరించాయి. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంచ‌క్కా సెటిల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news