బీఎస్ఎన్ఎల్ శుభవార్త.. యూజర్లకు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్..!

ప్రముఖ టెలికాంరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు శుభవార్తను అందించింది. వినియోగదారులకు రూ.106, రూ.107 ధరకే సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ను ప్రకటించింది. అయితే ఈ ప్లాన్స్ కి సంబంధించి.. వాటి ఆఫర్స్ గురించి తెలుసుకుందాం..బీఎస్ఎన్ఎల్ సంస్థ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. రూ.106, రూ.107 ప్లాన్స్‌ని 100 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. 3జీబీ డేటాను కూడా అదనంగా ఇస్తోంది. డిసెంబర్ 1 నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించింది. అదే రోజున మరిన్ని ప్లాన్ల సవరణలను తీసుకురానుంది.

BSNL
BSNL

బీఎస్ఎన్ఎల్ రూ.106 ప్లాన్ పర్ సెకండ్ ప్లాన్. గతంలో 28 రోజుల వ్యాలిడిటీ లభించేది. డిసెంబర్ 1 నుంచి 100 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్… 3జీబీ డేటా వాడుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ను 60 రోజులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ రూ.107 ప్లాన్ పర్ మినిట్ ప్లాన్ కూడా అచ్చం రూ. 106 ఉన్న సేవలన్నీ ఉంటాయి. అయిదే ఈ రూ. 107ప్లాన్ భారతదేమంతా అందుబాటులోకి రానుంది. ఇక ప్రస్తుతం ఇనాక్టీవ్‌గా ఉన్న కస్టమర్లకు స్పెషల్ టారిఫ్ వోచర్ రూ.187, ప్లాన్ వోచర్ రూ.1477 పై 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. 172 రోజుల క్రితం సిమ్ వ్యాలిడిటీ ఎక్స్‌పైరీ అయిన కస్టమర్లు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్స్ నవంబర్ 30 వరకు దేశంలోని అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఇక రూ.1499 ప్లాన్ వోచర్‌ను కూడా ప్రకటించింది. ఇందులో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ వస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 24 జీబీ డేటా వస్తుంది. ఇనాక్టీవ్ కస్టమర్లకు ఈ ప్లాన్ రూ.1199 ధరకే లభిస్తుంది. ఇక బీఎస్ఎన్ఎల్ రూ.199, రూ.798, రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కొత్తగా ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఈ కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ సేవలు కూడా దేశమంతటా అందుబాటులోకి వస్తాయి.