మోడీకి ట్రంప్‌ గతేపడుతుంది..సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

అమెరికా ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు..మోడీ-ట్రంప్‌ ఇద్దరూ ఒక్కటేనని..వారిద్దరూ నయవంచకులుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు..అమెరికాలో ట్రంప్‌కు పట్టిన గతే ఇక్కడ నరేంద్ర మోదీకి పడుతుందన్నారు..దౌత్యపరంగా యూఎస్‌లో మోడీ కొనసాగించిన విధానాల వల్ల దాని ప్రభావం భవిష్యత్తులో మోడీ అనుభవిస్తారని..అది బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమితో మోదీ పతనం ఆరంభమవుతుందన్నారు..ఎన్నికల ముందు అమెరికాలో పర్యటన సంధర్భంగా ఏక్‌ భార్‌ ట్రంప్‌ అని నినాదం ఇచ్చి ట్రంప్‌ ఓటమికి పరోక్షంగా కారణం అయ్యారని..ట్రంప్‌ భారత పర్యటనకువచ్చినప్పుడు మోడీని ఆకాశాన్నిఎత్తుకున్నారు..ఇప్పుడు ట్రంప్‌ ఘోరంగా పరాభం పోందారు..తర్వాత మోడీకి అదే గతి పడుతుందన్నారు నారాయణ.అమెరికాలో ఎన్నికల అనంతరం ఇండో చైనా సరిహద్దుల్లో యుద్ధం సద్దుమణిగిపోతుంది..బెంగాల్‌ ఎన్నికలతో మళ్లీ ప్రారంభమవుతుంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణవిమర్శించారు.తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే మోదీ అజెండా అని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని, వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతోందన్నారు.