రెహానా ఫాతిమాకు బీఎస్‌ఎన్‌ఎల్ షాక్..! తప్పు చేసింది.. అనుభవిస్తుంది..!

-

rehana fathima
rehana fathima

తనకు తాను సోషల్ వర్కర్ గా చెప్పుకుంటుంది.. కానీ సమాజంలో చిచ్చు పెట్టె పనులు చేస్తుంది. వివాదాలు సృష్టించడంలో కూడా ఎక్స్ పర్ట్. గతంలో ఆడవారిని శబరిమలకు ఎందుకు పంపరు అంటూ పెద్ద వివాదాలే సృష్టించింది. ఇక తాజాగా నగ్నంగా పడుకొని తన కొడుకుతో ప్రైవేట్ పార్ట్స్ పై పెయింటింగ్ వేయించుకుంది. ఆ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి పెను వివాదం సృష్టించింది ఆమెపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది.

వివాదం సృష్టించి 18 నెలలు జైల్లో గడిపింది, మరో వివాదం సృష్టించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించుకున్న ఆ వివాదాల సోషల్ వర్కరే కేరళకు చెందిన రెహానా ఫాతిమా…! ఇక ఆమె ప్రవర్తనతో చుట్టు పక్కల వారికి ఇబ్బందిగా మారింది. దాంతో ఆమె ఉంటున్న బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్ ను ఖాళీ చేయలాంటూ బీఎస్‌ఎన్‌ఎల్ ఆదేశాలు జారీ చేసింది. అసలు విషయానికొస్తే ఆమె బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి, కాగా ఆమె ఉద్యోగ గడువు ఈ ఏడాది మే 11 న ముగిసింది. దాంతో ఆమెకు ఇకపై ఆ క్వార్టర్స్ లో ఉండేందుకు ఎటువంటి అర్హత లేదని బీఎస్‌ఎన్‌ఎల్ తేల్చి చెప్పేసింది. ఆమెక అనర్హతా నోటిస్లు ఇస్తూ క్వార్టర్స్ ను వెంటనే ఖాళీ చేయవలసిందిగా బీఎస్‌ఎన్‌ఎల్ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news