బెజ‌వాడ టీడీపీలో నోళ్ల‌కు తాళం.. ఆ ఒక్క‌టే లేస్తోంది..!

-

అంద‌రూ రాజ‌కీయ వీరులే! ఎవ‌రికి వారు నా స‌త్తా ఏంటో చూపిస్తా! అని తొడ‌లు కొట్టిన‌వారే.. జ‌బ్బ‌లు చ‌రు చుకున్నవారే! కానీ, అదేంటో.. అస‌లు సిస‌లు యుద్ధంలోకి దిగేస‌రికే.. ఎవ‌రికి వారు కాళ్లు ముడుచుకుని దు ప్ప‌ట్లు ముసుగుత‌న్నేస్తున్నారు! -ఇదీ ఇప్పుడు పేరెన్నిక‌గ‌న్న బెజ‌వాడ టీడీపీ రాజ‌కీయాలపై వినిపిస్తున్న మాట‌! అయితే, ఇదేదో గిట్ట‌ని వారో.. అధికార పార్టీవారో.. అంటే.. ఆ ప‌నాపాటా!? అంటూ.. పెద‌వి విరిచేయొ చ్చు! పేప‌ర్ అయితే.. పేజీ తిప్పేయొచ్చు.. ఛాన‌ల్ అయితే.. బ‌ట‌న్ నొక్కి మార్చేయొచ్చు!! కానీ, ఇలాంటి వ్యాఖ్య‌లు వినిపిస్తున్న‌వి సాక్షాత్తూ.. అయిన త‌మ్ముళ్ల నుంచే!

టీడీపీకి బ‌ల‌మైన కోట‌గా మారుతుంద‌ని భావించిన బెజ‌వాడ‌లో నాటి అధికార పార్టీకి చావుత‌ప్పింది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించి.. ప‌రువును ఠీవీగా నిల‌బెట్టారు. అయితే, గెలిచిన వారిలో అసంతృప్తి.. గెల‌వ‌ని వారిలో నిర్వేదం వెర‌సి.. పార్టీ త‌ర‌ఫున వ‌కాల్తా నువ్వు పుచ్చుకో.. అంటే.. నువ్వు పుచ్చుకో.. అంటూ..వాయినా విష‌యంలో వెనుకాడే పేరంటానికి వ‌చ్చిన ప‌డ‌తుల మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నోరు విప్పితే.. క‌స్సు బుస్సులు త‌ప్ప‌.. నిల‌కడైన పాలిటిక్స్ చేయ‌డం చేత‌క‌ని సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే ఎప్పుడో గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడు మీడియా ముందుకు వ‌స్తున్నారు.

ఇక‌, ఎంపీగారు ఉన్నా.. నాకేంటి? అనే త‌ర‌హాలో కోట శ్రీనివాస‌రావును గుర్తు చేస్తున్నార‌ట‌! ఇక‌, గెలిచిన ఎమ్మెల్యే గారు.. నేనేం చేసినా.. నాకేమీ ద‌క్క‌డం లేదు.. నేనెందుకు మాట్లాడాలి! అని మూతి బిగించుకుని సొంత ప‌నుల్లో బిజీ అయ్యారు. దీంతో పార్టీ గురించి కానీ, అధినేత చంద్ర‌బాబును అనుస‌రించేవారు కానీ.. బెజ‌వాడ‌లో క‌నిపించ‌డం లేదు. ఈ స‌మ‌యంలోనే నున్నానంటూ.. జెండా ఎగ‌రేస్తున్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌.

త‌న‌దైన దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ..వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ల‌పైనా, నాయ‌కుల‌పైనా స‌టైర్లు పేలుస్తున్నారు. అమ్మ జ‌గ‌నా అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారంటూ.. తాజాగా ఆయ‌న చేసిన విమ‌ర్శ‌.. రాష్ట్ర రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో ఔరా.. క‌లుపుమొక్క అని ప‌క్కన పెట్టిన బుద్దానే బాబుకు ఆప‌ద్బాంధ‌వుడు అయ్యాడే! అని నోళ్లు నొక్కుకుంటున్నారు త‌మ్ముళ్లు!

Read more RELATED
Recommended to you

Latest news