ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలి అంటే ఇప్పుడు యువ నాయకులను కలుపుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒక్క లోకేష్ మినహా అందులో కీలక పదవుల్లో ఉన్న యువ నాయకులు ఎవరూ లేరు అదే విధంగా ఎవరూ కూడా స్వేచ్చగా పని చేసే వారు కూడా లేరు అనేది వాస్తవం. చంద్రబాబు ఎవరికి యువనేతలకు స్వేచ్చ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.
ఇక ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో ఇప్పుడు గల్లా జయదేవ్ ని కొన్ని శక్తులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. లోకేష్ అండతో కొందరు నేతలు గల్లాను గుంటూరు జిల్లాలో పక్కన పెట్టారు అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. గల్లా విషయంలో చంద్రబాబుకి తెలిసి ఆయన అన్నీ సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినా సరే తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది అంటారు.
అగ్ర నాయకులు కూడా ఇప్పుడు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు అని గల్లాలో తీవ్ర అసహనం ఉంది అని అంటారు. గల్లా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఆయన ఇప్పటికే బిజెపి అధిష్టానం తో చర్చలు కూడా జరిపారు అని బిజెపి అధిష్టానం కూడా అందుకు ఓకే చెప్పింది అని వచ్చే ఏడాది మొదట్లో ఆయన న్నీ చూసుకుని పార్టీ మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.