బడ్జెట్‌–2021: రూ.64,180 కోట్లతో ఆరోగ్య రంగానికి పెద్దపీట..

-

2021–22 బడ్జెట్‌ను సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆమె ప్రసంగాన్ని చదివేందుకు సిద్ధమవుతుండగా విపక్షాల నిరసనలు మొదలయ్యాయి. అయినా నిర్మలా సీతారామన్‌తన ప్రసంగాన్ని ప్రారంభించారు.. కరోనా దెబ్బకు కుదేలైన రంగాలను బాగు చేసేందుకు ‘అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లక్షల్లో ఉచితంగా ధాన్యం, ఆహారం పంపిణీ చేశాం. దాదాపుగా 80 మిలియన్ల జనాభాకు ఉచితగ్యాస్‌ అందజేశాం. ఆత్మనిర్భల్‌ భారత ప్యాకేజీని ప్రకటించామన్నారు’.

15 హెల్త్‌ ఎమర్జెన్సీ సెంటర్లు..

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మరో రెండిటిని ఇతర దేశాలకు వాక్సిన్ల డోసులు ఎగుమతి చేస్తున్నామని స్పష్టం చేశారు. దాదాపుగా 100 దేశాలకు మన దేశం తరఫున కరోనా టీకాలను సరఫరా చేస్తున్నామన్నారు.
ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గతంలో ఎన్నడూలేని విధంగా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్‌ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరేళ్ల కాలానికి రూ.64,180 కోట్లతో ఆత్మనిర్భర్‌ హెల్త్‌ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ దేశం మొత్తం 15 హెల్త్‌ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news