పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ రాజ్యసభ, లోక్ సభ సభ్యులను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనంతరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రపతి ప్రసంగానికి టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించనున్నారు. కాగ ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎంపీలకు పలు సూచనలను చేశారు. అలాగే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు.
అలాగే కేంద్రపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన విధి విదానాలపై కూడా చర్చించారు. అలాగే 23 అంశాలతో కూడిన ఒక పుస్తకాన్ని ఎంపీలకు అందించారు. ఈ పుస్తకం ఆధారంగా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. కాగ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే రాష్ట్రానికి న్యాయ పరంగా, చట్ట పరంగా రావాల్సిన నిధుల గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు.