మాటిమాటికీ ఏడ్చే ఆడవాళ్లు ఎలాంటి వారో తెలుసా..? వారి గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

-

అమ్మాయిలు అంటేనే సున్నితమనస్థులు. అందుకే వారిని సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలంటారు. అమ్మాయికి అందం ఆ చిరునవ్వే. ఆ నవ్వు చూస్తూ బతికేయొచ్చురా అంటుంటారు. సంతోషం వచ్చినప్పుడు ఎంతా బాగా నవ్వుతారో.. బాధ వచ్చినప్పుడు అంతే ఘోరంగా ఏడుస్తారు. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా కష్టం కష్టమే. కానీ.. అబ్బాయిలు పాపం ప్రతిదానికి ఏడిస్తే.. వచ్చిన కష్టం కన్నా సూటిపోటి మాటలకు ఎక్కువైపోతాయి. వాళ్లలో వాళ్లే నలిగిపోతారు.

కానీ అమ్మాయిలు అలా కాదు.. చిన్న కష్టం వచ్చినా…కుళాయి తిప్పేస్తారు. అందరూ ఇలానే ఉంటారు అని కాదు..కానీ మూడువంతులు అమ్మాయిలు తమ బాధను కన్నీళ్లలోనే చూపిస్తారు. అయితే ఇంకొంతమంది మరీ చిన్న చిన్న విషయానికే ఏడుస్తారు. ఎదుటివారికి అరే దీనికి కూడా ఏడుస్తారా అనిపిస్తుంది. అప్పటివరకూ స్ట్రాంగ్ గానే ఉన్నట్లు కనిపిస్తారు..కానీ అంతలోనే ఏడ్చేస్తారు.

ఇలా మాట మాటకి ఏడ్చేవారిని చూస్తే అబ్బాయిలకు చిరాకు కలగడం సహజం. కానీ.. వారు ఇలా ఎందుకు ఏడుస్తారు..? వారు ఎలాంటి వారు అనేది తెలిస్తే.. ఇకపై ఎప్పుడు వారిపై చిరాకు కలగదు. ఈరోజు మనం చీటికిమాటికి ఏడ్చే అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం.

ఇటువంటి ఆడవారు ఎదుటి వారి కష్టాలకి చలిస్తారు. వారి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు అవడం వల్లే మాట మాటకి ఏడ్చేస్తారట. ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనసు వాళ్లది. అవతలివారిని చాలా బాగా అర్ధం చేసుకుంటారు. తమకి బాధ కలిగినా.. ఎదుటివారిని మాత్రం బాధ పెట్టకుండా చూసుకోవాలనే మనస్థత్వం కలవారు.

అయితే వీరికి మొహమాటం బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరితోనూ త్వరగా కలవలేకపోతుంటారు. తమకు ఎవరు లేరు.. తాము ఒంటరి అన్న భావన వీరిని వెంటాడుతూనే ఉంటుంది. తమని చూసి నవ్వుకుంటున్నా.. వీరు తమ ఉద్వేగాలను దాచుకోలేరట. ఎవరైనా వీరిని బాధ పెడితే.. బాధతో ఏడుస్తారు తప్ప.. తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని కానీ.. వారిని సాధించాలని కానీ వీరికి ఉండదు.

మీ స్నేహితుల్లో.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలాంటి ఆడవారు ఉంటే వారికి అండగా ఉండి భరోసాని ఇవ్వండి. ఆమె బాధని అర్ధం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇలాంటి వారు కష్టాలను భరించాలని అనుకుంటారు తప్ప.. వదిలేసి వెళ్లాలని ఎప్పటికి అనుకోరు. నిజానికి ఇలాంటి స్వచ్ఛమైన మనసు ఉన్న వారు దొరకడం కూడా అదృష్టమే. ఇప్పటికే మీ జీవితంలో ఇలాంటి వారు ఉంటే.. వారిని వదులుకోకండి. వారి భావోద్వేగాలను అర్ధం చేసుకుని.. వారి నుంచి మరింత ప్రేమని పొందండి. ఇలాంటి వారు ఉంటే ఈ ఆర్టికల్ షేర్ చేసేయండి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news