హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో పేషెంట్ శరీరంలో బుల్లెట్ కలకలం రేపింది. ఫలక్‌నుమాకు చెందిన ఆస్మా బేగం శరీరంలో వైద్యులు బుల్లెట్‌ను గుర్తించారు. ఈ నెల 21న ఆపరేషన్ చేసి పొట్టలో ఉన్న బుల్లెట్‌ను తీసివేశారు. అయితే ఆ బుల్లెట్ గురించిన ఎలాంటి వివరాలు ఆస్మాబేగం చెప్పలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కుమార్తె (18) కుట్టుమిషన్ కుట్టుకుంటూ బ్రతుకుతుంది. మూడు నెలలుగా వెన్నెముకలో నొప్పిగా ఉండటంతో నిమ్స్ లో చేరింది.
వివిధ పరీక్షల తరువాత, ఆమె శరీరంలో గాయం ఉందని తేల్చిన వైద్యులు, ఆపరేషన్ చేయగా, బుల్లెట్ బయటపడింది. ఇది కనీసం మూడేళ్ల నుంచి ఆమె శరీరంలో ఉండి ఉండవచ్చని వైద్యులు తేల్చారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వారు గతంలో ఏ ప్రాంతంలో ఉండేవారు? అక్కడ ఏదైనా ఫైరింగ్ పాయింట్స్ ఉన్నాయా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.