భద్రతా బలగాలు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో ఒక 11 బాలుడి తలకు బుల్లెట్ తగిలింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయ పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు లోని పుదుకొట్టయి జిల్లాలో గల నర్తమళయి లో చోటు చేసుకుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలోని నర్తమళయిలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ ( సీఐఎస్ఎఫ్ ) లో ఫైరింగ్ రేంజ్ ఉంది. ఈ ఫైరింగ్ రేంజ్ లో సీఐఎస్ఎఫ్ బలగాలు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుంటాయి.
అయితే గురు వారం కూడా సీఐఎస్ఎఫ్ బలగాలు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో 1.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక బాలుడి తలకు బుల్లెట్ తగిలింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయ పడ్డాడు. ఆ బాలున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి బుల్లెట్ గాయం తగిలిందని అక్కడి సీనియర్ పోలీసు తెలిపారు. అయితే ఆ బుల్లెట్ గాయం ఫైరింగ్ రేంజ్ నుంచి వచ్చిందా.. లేదా మరి ఎక్కడి నుంచి అయిన వచ్చిందా.. అని విచారణ చేస్తున్నామని తెలిపారు. అయితే పుదుకొట్టయి జిల్లా కలెక్టర్ ఆ ఫైరింగ్ రేంజ్ ను మూసివేసింది.