బాహుబలి బ్యూటీకి కరోనా పాజిటివ్..

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి.. మూడు నెలలకోకసారి… రూపాంతరం చెంది… పడగ విప్పుతోంది. ఇక ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా.. చిత్ర పరిశ్రమపై పడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారీన బాలీవుడ్‌ స్టార్లు, కమల్‌ హాసన్‌ లాంటి నటులు పడ్డారు. ఇక తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ.. డ్యాన్సర్‌ నోరా ఫతేహి కరోనా బారిన పడ్డారు.

ప్రస్తుతం తాను వైద్యుల సమక్షంలో.. క్వారంటైన్‌ లో ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని నోరా ఫతేహి తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేసింది. ”ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఉన్నాను. దయ చేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్‌ వేగంగా.. వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ ప్రభావం తాజాగా నా పైన తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా.. రావచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అంటూ నటి నోరా ఫతేహి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news