రాత్రంతా డైరెక్టర్‌తో పడుకుంటేనే అవకాశాలు : సీరియల్‌ న‌టి సంచలన వ్యాఖ్య‌లు

-

సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంటుందని.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటులు చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ.. కాస్టికంగ్‌ కౌచ్‌ పై లేడీ నటులు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే.. బుల్లి తెర దివ్యాంక త్రిపాఠి తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

” ఓ సీరియల్‌ లేదా షోను పూర్తి చేసిన అనంతరం.. అసలు ఇబ్బందులు ఎదురవుతాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. చెల్లించాల్సిన ఈఎంఐలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఓ ఆఫర్‌ వచ్చింది. ఓ డైరెక్టర్‌ తో రాత్రంతా ఉండే అతను నీకు అవకాశం ఇస్తాడు అన్నారు. నన్నె ఎందుకిలా అడుగుతున్నారని నేను ప్రశ్నింస్తే… నువ్వు తెలివైన దానివన్నారు. అలాంటి వాళ్లు పరిశ్రమలో చాలా మంది ఉంటారు. వాళ్లు పరిశ్రమలో ఇవన్నీ కామన్‌ అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఒక వేళ మనం ఒప్పుకోకపోతే.. మన కెరీర్‌ ను నాశనం చేస్తామని బెదిరిస్తారు. కానీ వాళ్ల ఆఫర్స్‌ ను ఒప్పుకోకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. ” అంటూ దివ్యాంక త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా.. దివ్యాంక త్రిపాఠి.. బనూ మై తేరీ దుల్హన్‌, యే హై మొహబతే లాంటి సీరియల్స్‌ లో నటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news